NZB | కోర్టు ఆదేశాల మేరకు త్వరలో పంచాయతీ ఎన్నికలు : మంత్రి సీతక్క

బిక్కనూరు, జులై 15 (ఆంధ్ర ప్రభ) : హైకోర్టు ఆదేశాల (HighCourt orders) మేరకు త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు (Local body elections) నిర్వహిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) చెప్పారు. మంగళవారం కామారెడ్డి జిల్లా బిక్కనూరు మండలంలో ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో ప్రజాప్రతినిధులు లేక అభివృద్ధి కుంటు పడుతుందని చెప్పారు.

గ్రామాల అభివృద్ధి పంచాయతీ కార్యదర్శుల (Panchayat Secretaries) పై పడడంతో వారు సరైన అభివృద్ధి చేయలేకపోతున్నారని తెలిపారు. కేంద్రం నుండి సరైన నిధులు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో పనులు చేసిన కాంట్రాక్టర్ల (contractors) కు బిల్లులు చెల్లించకపోవడంతో ప్రస్తుతం త‌మపై భారం పడుతుందని చెప్పారు. అయినప్పటికీ ఎన్ని ఇబ్బందులైనా కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఒక కమిటీని సైతం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఉచిత ఇసుక ప్రభుత్వం సరఫరా చేస్తుందని తెలిపారు. రాష్ట్రం అప్పుల్లో ఉన్నప్పటికీ ఒకప‌క్క‌ సంక్షేమం, మరోపక్క అభివృద్ధితో పాటు కాంట్రాక్టర్లకు చెల్లించవలసిన బిల్లులు చెల్లిస్తూనే ప్రభుత్వం ముందుకు పోతుందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునే లబ్ధిదారులకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. వారికి బిల్లులు రాగానే తిరిగి సంఘాలకు డబ్బులు చెల్లించవలసి ఉంటుందని ఆమె చెప్పారు. ఈసమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాసరావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భీమ్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు.

Leave a Reply