AP | సింగపూర్ పర్యటనకు చంద్రబాబు.. పెట్టుబడులే ప్రధాన లక్ష్యం !

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్‌లో పర్యటించనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంతో ఆయన ఈ నెల 26న‌ సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు

చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, పొన్నాడ నారాయణతో పాటు పలువురు ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఈ బృందం 30వ తేదీ వరకు సింగపూర్‌లో పర్యటించి అనేక సమావేశాలు నిర్వహించనుంది.

సింగపూర్‌లో ప్రభుత్వ ప్రతినిధులు, ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులతో చంద్రబాబు బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, పునరుత్పాదక ఇంధనం, మౌలిక సదుపాయాలు వంటి కీలక రంగాల్లో పెట్టుబడుల అవకాశాలను వివరించి, రాష్ట్ర ప్రభుత్వం అందించే ప్రోత్సాహక పథకాలను వివరించనున్నారు.

Leave a Reply