హైదరాబాద్ – తాము బీసీ రిజర్వేషన్లు తెస్తే ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha) రంగులు పూసుకొని తీన్మార్ డ్యాన్సులు చేస్తోందని సెటైర్లు గుప్పించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) . బీఆర్ఎస్( BRS) హయాంలో సామాజిక తెలంగాణ (social telangana ) రాలేదన్న కవిత ఆ పార్టీకి రాజీనామా ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కవిత తీరును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని (laughing ) ఎద్దేవా చేశారు. రంగులు, వేషాలు మార్చినంత మాత్రాన పిల్లి (cat), పులి (tiger) కాలేదని దెప్పిపొడిచారు
గాంధీభవన్ లో ఆయన నేడు మీడియాతో మాట్లాడుతూ, కవిత ఏ పార్టీలో ఉందో అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్‌లో దెయ్యాలు ఉన్నాయని చెప్పిన కవిత వారి పేర్లు ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు చేసినప్పుడు కవితా లిక్కర్ స్కాంలో ఊసలు లెక్కపెడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి ఎవరికి కట్టబెట్టారని ప్రశ్నించారు కమలనాధులను ప్రశ్నించారు టిపిసిసి చీఫ్. రామచంద్రరావు నియామకంతోనే బీసీలపై బీజేపీ చిత్త శుద్ధి ఏంటో తేలిపోయిందని విమర్శించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే అని తాము పదే పదే ఏఐసీసీ హై కమాండ్ దగ్గర పట్టుబట్టడం జరిగిందని గుర్తుచేశారు. తన కోరికను, రాహుల్‌గాంధీ ఆశయాన్ని నెరవేర్చిన ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సీఎం రేవంత్ రెడ్డికి, మంత్రులకు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో ఎవరూ దొంగలు..?, హీరోలు..? అన్నది తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెప్పుకొచ్చారు.