Jannaram | త‌హ‌సీల్దార్ ను బ్లాక్ మెయిల్ చేసిన వ్య‌క్తిపై కేసు

క్రిమిసంహారక మందు డబ్బాతో హల్చల్


జన్నారం, జులై 12 (ఆంధ్రప్రభ) : భూ వ్యవహారంలో క్రిమిసంహారక మందు డబ్బా పట్టుకొని తాగి చనిపోతానని ఆఫీసులో తహసీల్దార్ (Tahsildar) ను బ్లాక్ మెయిల్ చేస్తూ విధులకు ఆటంకపరిచి హల్చల్ చేసిన ఓ వ్యక్తి సంఘటన ఇది. మంచిర్యాల (Mancherial) జిల్లా జన్నారం తహసీల్దార్ సి.రాజమనోహర్ రెడ్డి (C. Rajamanohar Reddy) ని పట్టా ఎలా మార్పిడి చేస్తావంటూ, విధులకు ఆటంకపరిచి, క్రిమిసంహారక మందు తాగి చనిపోతానని బ్లాక్ మెయిల్ చేసిన కయ్యం రామన్నపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష తెలిపారు.

మండలంలోని రోటిగూడ గ్రామానికి చెందిన‌ కయ్యం మల్లయ్య (Mallaiah), రెండో కుమారుడు కయ్యం తిరుపతి భార్య లావణ్య పట్ట మార్పిడి కోసం దరఖాస్తు చేసుకున్నారు. మల్లయ్య చిన్న కుమారుడైన రామన్న శుక్రవారం సాయంత్రం 4 గంటలకు తాహసీల్దార్ కార్యాలయానికి వచ్చి పురుగుల మందు తాగి చనిపోతానంటూ బ్లాక్ మెయిల్ చేసి, విధులకు ఆటంక పరిచినందుకు తాహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఆమె తెలిపారు.

Leave a Reply