సిద్దిపేట : సిద్ధిపేట (Siddipet) జిల్లా అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) గరిమ అగ్రవాల్ హుస్నాబాద్ (Husnabad) మునిసిపాలిటీ పరిధిలో చేపట్టిన TUFIDC పనులపై సమీక్షా సమావేశాన్ని (Review meeting) సిద్ధిపేటలోని ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి హుస్నాబాద్ మునిసిపల్ కమిషనర్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్), డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్), అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (పబ్లిక్ హెల్త్), కాంట్రాక్టర్లు హాజరయ్యారు.
సమీక్ష సందర్భంగా అదనపు కలెక్టర్ వివిధ పనుల పురోగతిని పరిశీలించారు. పనుల నాణ్యతను మెరుగు పరచడంతో పాటు, వేగంగా పూర్తి చేయాల్సిందిగా అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు సూచనలు ఇచ్చారు. ప్రజలకు ప్రయోజనం కలగాలంటే సమయానికి లోపల ప్రాజెక్టులు పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.