ADB | ఆయిల్ ఫామ్ మొక్కలపై మగ పురుగుల విడుదల

ఉద్యాన వన శాఖ అధికారి కె క్రాంతి, కుమార్


ఆదిలాబాద్ : జిల్లాలోని ఇంద్రవెల్లి (Indravelli) ఆయిల్ పామ్ పొలాల్లో పరపరాగ సంపర్కంకి దోహదపడే కీటకాలు అయినా వివల్స్ ఎలాడోబియాస్ కామేరునికస్ (Weevils Eladobias camerunicus) అనే కీటకాలను ముత్నూర్ గ్రామం వద్ద ఉన్న ఆయిల్ ఫామ్ రైతు రామ్ కుమార్ జైస్వాల్ (Ram Kumar Jaiswal) పంట పొలంలో ఉద్యాన శాఖ, ప్రియునిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారు విడుదల చేశారు.

ఈసంద‌ర్భంగా ఉద్యానవన శాఖ అధికారి క్రాంతికుమార్ (Krantikumar) మాట్లాడుతూ.. ఈ పురుగుల విడుదల వల్ల పరిసర ప్రాంతపు పది కిలోమీటర్ల వరకు ఉన్న ఆయిల్ ఫామ్ పొలాల్లోకి తిరుగుతూ వెళ్లి ఈ ఎగిరే పురుగులు ఆయిల్ పామ్ పంటకు ఎంతో దోహదంగా ఉంటుందన్నారు. ఈ విడుదల వల్ల ఆయిల్ ఫామ్ గెలల దిగుబడి గణనీయంగా పెరుగుతోందన్నారు. నిర్మల్ ప్రాంతంలో అత్యధికంగా ఆయిల్ ఫామ్ సాగు జరుగుతుందన్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ప్రాంతాల్లో సైతం గిరిజనుల పొలాల్లో నీటి సౌకర్యం ఉన్న రైతులు ముందుకు వచ్చి ఆయిల్ ఫామ్ పంటపై మొగ్గు చూపెట్టాలన్నారు. ఎందుకంటే నాలుగు సంవత్సరాల పాటు అంతర పంటలను తీస్తూ ఈ ఆయిల్ ఫామ్ సాగు ముందు వచ్చే తరాలకు 35సంవత్సరాల వరకు అతివృష్టి, అనావృష్టి ఉన్న ఈ పంట సహకరిస్తుందన్నారు. గిరిజన రైతులకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సబ్సిడీ మొక్కలు, డ్రిప్ సౌకర్యా లను కల్పిస్తూ.. ఎకరానికి ప్రభుత్వ పరంగా రూ.4,200లు ఆయిల్ ఫామ్ సాగు రైతులు నేరుగా ఖాతాల్లో వస్తుందన్నారు. ఈకార్యక్రమంలో ఉద్యాన అధికారి కె.క్రాంతి కుమార్, ఏరియా మేనేజర్ శ్రీకాంత్, క్లస్టర్ ఆఫీసర్ రాథోడ్ సిద్ధాంత, ఆయిల్ ఫామ్ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply