Foreign Tour | ప్రధాని మోడీకి అపూర్వ గౌర‌వం – వ‌రిస్తున్న అత్యున్న‌త పుర‌స్కారాలు

ముగిసిన అయిదు దేశాల ప‌ర్య‌ట‌న
ఢిల్లీకి చేరుకున్న ప్ర‌ధాని మోదీ
ఈ టూర్‌లో మూడు దేశాల అత్యున్నత పురస్కారాలు
ఇప్పటివరకు మోదీకి 27 అంతర్జాతీయ పురస్కారాలు

న్యూ ఢిల్లీ, ఆంధ్ర‌ప్ర‌భ :
ప్రధాని మోదీ (prime minister modi ) తన ఎనిమిది రోజుల (eight days) విదేశీ పర్యటన (tour) నేటితో ముగిసింది.. ప‌ర్య‌ట‌న‌ను ముగించుకుని గురువారం ప్ర‌ధాని ఢిల్లీ(delhi ) వ‌చ్చేశారు. ఈ ఎనిమిది దేశాల ప‌ర్య‌ట‌ల‌నో ఆయ‌న‌కు అరుదైన గౌరవాలు ల‌భించాయి. ఒకే పర్యటనలో ఏకంగా మూడు దేశాల అత్యున్నత పౌర పురస్కారాలను (civil awards ) స్వీకరించారు. ఈ పర్యటనలో భాగంగా బ్రెజిల్ (Brazil) , నమీబియా, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాలు తమ అత్యున్నత పౌర పురస్కారాలను ప్రధాని మోదీకి అందించి సత్కరించాయి. 2014లో అధికారంలోకి వచ్చినప్ప‌టి నుంచి మోదీ విదేశీ ప్రభుత్వాల నుంచి అందుకున్న అంతర్జాతీయ పురస్కారాల సంఖ్య దీంతో 27కు చేరింది.

ఆర్థిక స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించేందుకు..

మొత్తం 8 రోజుల పాటు సాగిన ఈ పర్యటనలో ప్రధాని మోదీ ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా, బ్రెజిల్, నమీబియాతో సహా ఐదు దేశాలను సందర్శించారు. గ్లోబల్ సౌత్‌లో భారతదేశ ప్రభావాన్ని పెంచడం, ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయడం, ఆర్థిక సహకారాన్ని ప్రోత్సహించడం ఈ పర్యటన ముఖ్య ఉద్దేశ్యాలు. బ్రెజిల్‌లో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్న మోదీ.. ప్రపంచ ఆర్థిక పాలన, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలపై ఉన్నత స్థాయి చర్చలు జరిపారు. అలాగే, అర్జెంటీనాతో వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, రక్షణ రంగాల్లో సహకారంపై చర్చించగా.. ఘనా, నమీబియా దేశాల్లో మౌలిక వసతులు, విద్యా భాగస్వామ్యాలపై దృష్టి సారించారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ద్వారా ఇరు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు మరింత బలపడ్డాయి.

Leave a Reply