గీతాసారం (ఆడియోతో…) అధ్యాయం 6, శ్లోకం 19
యథా దీపో నివాతస్థో
నేంగతే సోపమా స్మృతా |
యోగినో యతచిత్తస్య
యుంజతో యోగమాత్మన: ||
తాత్పర్యము : గాలి లేని చోట నున్న దీపము నిశ్చలముగా నుండు రీతి, నిగ్రహింపబడిన మనస్సు గల యోగి పరత్త్త్వ ధ్యానమున సదా స్థిరుడై యుండును.
భాష్యము : భగవంతుడ్ని ప్రేమిస్తాడు కనుక భక్తుడు సదా తన ఆరాధ్య భగవానుని స్మరిస్తూ ఆయనను సేవిస్తూ ఆ ధ్యానములో గాలి లేని దీపము ఎంత నిశ్చలముగా స్థిరముగా నుండునో అట్లు ఉండును.
ఓం తత్సదితి శ్రీమద్భగవ ద్గీతా సూపనిషత్సు
బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే
కర్మసన్న్యాసయోగోనామ పంచమోధ్యాయ: ||
….పరమపూజ్యశ్రీ శ్రీమత్ ఎ సి ాభక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి ‘భగవద్గీత యథాతథం’ నుంచి ఇస్కాన్ హైదరాబాద్ వారి సౌజన్యంతో