ADB | చెక్ పోస్టుల్లో ఆంక్షలు ఎత్తివేయండి.. : ఎమ్మెల్యే బొజ్జు పటేల్
- రాష్ట్ర పీసీసీఎఫ్‌కు ఎమ్మెల్యే వినతిపత్రం
జన్నారం, ( ఆంధ్రప్రభ): ఉమ్మడి జిల్లాలోని కవ్వాల టైగర్ జోన్ పరిధిలోని అటవీ శాఖ చెక్ పోస్టుల వద్ద రాత్రి 9 నుంచి ఉదయం 6 గంటల వరకు వాహనాల రాకపోకలను నిషేదిస్తూ విధించిన ఆంక్షలను ఎత్తివేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
రాష్ట్ర ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియాల్ కు వినతిపత్రం అందజేశారు.
హైదరాబాదులోని ప్రధాన అటవీశాఖ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కలిసి వినతి పత్రం ఇచ్చారు.రాత్రి వేళల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరిస్తూవినతి పత్రంలో పేర్కొన్నారు.ఈ సందర్భంగా పీసీసీఎఫ్ సానుకూలంగా స్పందించారు.ఎమ్మెల్యే వెంట కొమురం భీం ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఉన్నారు.