మహబూబాబాద్ రూరల్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం (congress govt ) అధికారంలోకి వచ్చి, 18 నెలలు కాలంలో అనేక సంక్షేమ పథకాలు (welfare schemes ) అమలు చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు (deputy cm bhatti ) అన్నాడు. మంగళవారం మహబూబాబాద్ జిల్లాలోని పర్వతగిరి, సోమ్లా తండలో పలు అభివృద్ధి కార్యక్రమాలను డిప్యూటీ సీఎం భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి ప్రారంభమైందన్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, గిరిజన ప్రాంతాలకు అధిక శాతం నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
అభివృద్దికి అడ్డుపడుతున్న బీఆర్ఎస్
రాష్ట్రంలో అభివృద్ధికి బీఆర్ఎస్ నేతలు అభివృద్ధికి, అడ్డుపడుతూ ముఖ్యమంత్రిపై స్థాయికి మించి, విమర్శలు చేస్తున్నారని భట్టి అన్నారు. బీఆర్ఎస్ నేతలు చౌకబారు మాటలు మానుకోవాలని హితవు పలికారు. ఇలాంటి నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక ఎన్నికల్లో ప్రతి కార్యకర్త ఒక సైనికుల పనిచేస్తూ అభ్యర్థులను గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రామచంద్ర నాయక్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండ సురేఖ, ధనసరి అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యేలు నాగరాజు, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.