శంషాబాద్, ఆంధ్రప్రభ : శంషాబాద్ (Shamshabad) లో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపింది. శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ (RGIA Police Station) సీఐ బాలరాజు తెలిపిన వివరాల ప్రకారం… కంత్రమోని లక్ష్మీమమ్మ అనే మహిళ తన ఇద్దరు పిల్లలను తీసుకుని శంషాబాద్ కల్లు కంపౌండ్ లో కల్లు తాగుతుంది. అయితే అదే కల్లు కాంపౌండ్ లోకి వచ్చిన గుర్తు తెలియని మహిళ లక్ష్మీమ్మ కుమార్తె కీర్తన (6) ను మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిపోయింది. తన కూతురును ఎవరో గుర్తుతెలియని మహిళ మాటల్లో పెట్టి ఎత్తుకెళ్లిందంటూ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన ఆర్టీఐఏ పోలీసులు నిందితురాలు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
Shamshabad | చిన్నారి కిడ్నాప్ కలకలం
