వికారాబాద్, జులై 4 ( ఆంధ్రప్రభ): మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వికారాబాద్ (Vikarabad) జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్ పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రోశయ్య చిత్రపటానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
పలువురు ముఖ్యమంత్రుల వద్ద ఆర్థిక శాఖ మంత్రిగా రాష్ట్రానికి చేసిన సేవలను ప్రజలు మర్చిపోలేదని, అనంతరం ముఖ్యమంత్రిగా తనదైన ముద్ర వేశారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవణాధికారి సత్తార్, జిల్లా విద్యాధికారి రేణుక దేవి, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా యూత్ సంక్షేమ అధికారి కృష్ణవేణి, డీటీడీఓ కమలాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.