కర్నూలు బ్యూరో, జులై 3, ఆంధ్రప్రభ : కర్ణాటక (Karnataka) ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాల మూలంగా తుంగభద్ర (Tungabhadra) జలాశయం నిండుకుండను తలపిస్తుంది. ఈ క్రమంలో డ్యాంలో కనిష్ట స్థాయిలో నీటిని నిలువచేసుకొని 12గేట్ల ద్వారా 35వేల క్యూసెక్కులకు పైగా నీటిని దిగువ తుంగభద్ర నదిలోకి వదులుతున్నారు. తుంగభద్ర జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 1633 అడుగులకు గాను 1625.53 అడుగులుగా ఉంది. ఇక జలాశయంలో 105.788 టీఎంసీలకు గాను 78.239 టీఎంసీలో నీరు నిల్వ ఉంది. ఇక జలాశయంకు 28,500 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా ఉంది.
Tungabhadra Dam: నిండుకుండలా తుంగభద్ర.. 12 గేట్ల ఎత్తివేత
