వికారాబాద్ టౌన్, జూలై 2 (ఆంధ్రప్రభ) : అనంతగిరిగుట్ట (Anantagirigutta) లో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. వనపర్తి జిల్లా గోపాల్ పూర్ మండలం ఏరుట్ల గ్రామానికి చెందిన రమేష్ (32) (Ramesh) హైదరాబాద్ లో ఒక కంపెనీలో ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. సోమవారం స్నేహితులతో అనంతగిరి వెళ్తున్నానని చెప్పి వచ్చినట్లు సమాచారం. స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీయకపోవడంతో అనుమానంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు.
మృతుని కుటుంబ సభ్యులు అనంతగిరికి విచ్చేసి పార్కింగ్ లో వాహనం గుర్తించి వికారాబాద్ (Vikarabad) పోలీసులకు సమాచారం ఇచ్చి పర్యాటక ప్రాంతం అనంతగిరి ఫారెస్ట్ పార్కింగ్ వద్ద ఫారెస్ట్ వారితో తెలుసుకోవడంతో మృతుని బైక్ పార్క్ చేసి సోమవారం వాటర్ ఫాల్ ప్రాంతంకు వెళ్లి ఎంతకు రాకపోవడంతో ఫారెస్ట్ సిబ్బంది వాహనం నెంబర్ ఆధారంగా కుటుంబీకులకు సమాచారం ఇచ్చే ప్రయత్నం చేసినమని వారు పేర్కొన్నారు.
ఈ సమాచారంతో కుటుంబీకులు మంగళవారం వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో అతని వద్ద గల సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసు వారితో వెతికినా వాతావరణం అనుకూలించకపోవడంతోఎలాంటి సమాచారం దొరకలేదు. బుధవారం ఉదయం. కుటుంబీకులు పోలీసులు వెతుకుతున్న క్రమంలో వెతుకుతుండగా చెట్టుకు ఉరేసుకొని కనిపించడంతో. సంఘటన వద్ద పరిశీలించిన అనంతరం పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
