Vikarabad | విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

వికారాబాద్ టౌన్, జూలై 2 (ఆంధ్రప్రభ ) : హ‌నుమాన్ దేవాల‌యంలో విగ్ర‌హాన్ని ధ్వంసం చేసిన వారిని క‌ఠినంగా శిక్షించాల‌ని బీజేపీ నేత‌లు కోరారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ ఐటిఐ శిక్షణ కేంద్రంలో ఉన్న హనుమాన్ దేవాలయం (Hanuman temple) లో విగ్రహాన్ని మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈవిష‌యాన్ని తెలుసుకున్న బీజేపీ నాయకులు (BJP leaders), వికారాబాద్ పట్టణ హిందూ బంధువులు దేవాలయం వద్ద చేరుకొని జరిగిన సంఘటనను పరిశీలించారు.

అనంతరం వారు మాట్లాడుతూ… ప్రశాంతమైన వికారాబాద్ (Vikarabad) లో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా దారుణమని వారు పేర్కొన్నారు. సంఘటనకు సంబంధించి పోలీసు వారు పూర్తి దర్యాప్తు చేసి ఎంతటి వారినైనా వదిలిపెట్టకుండా కఠినంగా శిక్షించాలని పోలీసు వారికి విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటనకు సంబంధించి ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు (CC cameras) పరిశీలిస్తే ఈ దుర్ఘటనకు పాల్పడిన వారిని ఈజీగా గుర్తించవచ్చని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు సదానంద రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుర్లపల్లి రమేష్ డిమాండ్ చేశారు.

Leave a Reply