Thammudu | త‌మ్ముడు ట్రైలర్ అదిరింది…

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్.. ఇప్పుడు తమ్ముడు మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకున్న తమ్ముడు మేకర్స్ఈ నెల 4న సినిమాను వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు అక్క- తమ్ముడు సెంటిమెంట్ స్టోరీతో థియేటర్స్ లోకి రానుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. నితిన్ సరసన కాంతార ఫేమ్ సప్తమీ గౌడ, వర్ష బొల్లమ్మ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ సచ్ దేవా, స్వాసిక, హరితేజ, చమ్మక్ చంద్ర తదితరులు ఇతర పాత్రల్లో యాక్ట్ చేస్తున్నారు.

రిలీజ్ నేప‌థ్యంలో ట్రైలర్ విడుదల చేశారు. “మా అమ్మ చనిపోయింది.. అమ్మ అయినా నాన్న అయినా అన్నీ అక్కే..” అంటూ నితిన్ చెబుతున్న బ్యాక్ గ్రౌండ్ డైలాగ్ తో ట్రైలర్ స్టార్ట్ అయింది. చిన్నప్పుడు నితిన్ ను ఆడిస్తున్నట్లు లయ కనిపించారు. ఆ తర్వాత తమ్ముడు అనిపించుకోలేవ్ అంటూ దూరంగా వెళ్తున్నట్లు చూపించారు. అనంతరం మొత్తం చిన్న చిన్న సీన్స్ ను చూపించిన మేకర్స్.. స్టోరీని రివీల్ చేశారు. అదే సమయంలో నితిన్.. తన అక్కకు ఏ కష్టం వచ్చినా తోడుగా ఉంటానని ప్రామిస్ చేస్తారు. మొత్తానికి టైల‌ర్ అంద‌ర్ని ఆక‌ట్టుకునేలా ఉంది.

Leave a Reply