పటాన్ చేరు : పెను విషాదాన్ని మిగిల్చిన సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి కెమికల్ (Camical) ఫ్యాక్టరీ ప్రమాదంలో మృతుల సంఖ్య (death toy) అంతకంతకు పెరుగుతోంది. మరణించిన వారి సంఖ్యను 42గా అధికారులు ప్రకటించారు.
ఈ పేలుడు ఘటనలో (Pashmailaram Blast) 42 మంది కార్మికులు మృతిచెందారు. వీటిలో నాలుగు మృతదేహాలను (four dead bodies,) గుర్తించారు. ఇంకా కార్మికుల మృతదేహాలు గుర్తించాల్సి ఉంది. మృతులు, క్షతగాత్రులు బీహార్, ఒడిసా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వాసులుగా గుర్తించారు.
అయితే.. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటివరకు పలు ఆస్పత్రుల్లో 35 మంది కార్మికులకి చికిత్స అందిస్తుండగా, 11 మంది పరిస్థితి విషమంగా ఉంది.
తెలంగాణ చరిత్రలోనే ఘోర పారిశ్రామిక ప్రమాదంగా అధికారులు చెబుతున్నారు. ఘటనాస్థలిలో సింగరేణి రెస్క్యూ టీం, ఎన్డీఆర్‌ఎఫ్, హెడ్రా, రెవెన్యూ, పోలీసుల సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఉన్నతాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ప్రస్తుతం ఫ్యాక్టరీ అడ్మిన్ భవన శిథిలాల ప్రక్రియ కొనసాగుతోంది. తొలగింపు తర్వాతే మృతుల సంఖ్యపై స్పష్టత రానుంది.
సిగచి ఆవరణలో పోలీసు ఆంక్షలు42కు చేరుకున్న మృతుల సంఖ్య
శిథిలాల కింద మరో 20 మంది
ప్రమాదంలో 47 మంది గల్లంతు..
ఆస్పత్రిలో తీవ్ర గాయాలతో 35 మందికి చికిత్స
.అందులో 11 మంది పరిస్థితి విషమం
57 మంది సరక్షితంగా ఇంటికి …