సినిమా రంగంలో తన నటనతో ఎంతగానో మెప్పించిన శ్రియా శరణ్… ఇప్పుడు ఫ్యాషన్ రంగంలోనూ అదరగొడుతోంది. ఇటీవల ప్రముఖ డిజైనర్ లేబుల్ కోసం ఆమె చేసిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. మాలిబులో గార్డెన్ ఆఫ్ ఈడెన్ కలెక్షన్‌కి చెందిన ప్యాస్టెల్ బ్లూ కలర్ లెహంగా లుక్‌లో ఆమె ఎటువంటి సందేహాలకూ తావు లేకుండా గ్లామర్‌కు కొత్త నిర్వచనం ఇచ్చింది. మృదువైన రంగులు, ఆకర్షించే డిజైన్, శ్రియా నడుమున మెరిసే ఆ హావభావాలు… అన్నీ కలగలిపి ఈ లుక్‌ను అద్భుతంగా మార్చేశాయి. ఈ లుక్‌లో కనిపించిన శ్రియా లెహంగా లైట్ బ్లూ షేడ్స్‌తో నాజూకుగా ఉంది. మెరుస్తున్న బ్లౌజు డిజైన్, మ్యాచ్ అయిన స్కర్ట్‌పై ఉన్న నాజూకు పువ్వుల ఎంబ్రాయిడరీ… ఆమెను ఒక ఫెయిరీటేల్ ప్రిన్సెస్‌లా చూపించింది. ఈ ఫోటోల్లో ఆమె వేసుకున్న జుమ్కాలు, మృదువైన హెయిర్‌స్టైల్ మరింత అందాన్ని జోడించాయి.


