WGL | కాటారంలో రోడ్డు ప్రమాదం… వ్యక్తికి తీవ్రగాయాలు

కాటారం, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌక్ వద్ద ఈరోజు మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. కాటారం మండలంలోని సబ్ స్టేషన్ పల్లికి చెందిన తోటరవి అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా కాళేశ్వరం నుండి భూపాలపల్లి వైపు వెళ్తున్న ఇసుక లారీ బైకును ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న వ్యక్తి కింద పడిపోగా, అతని కాళ్లపై నుండి లారీ టైరు వెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన రవిని కుటుంబ సభ్యులు వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ కు తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

ఇసుక లారీ తోట రవిని ఢీకొట్టిన విషయం సబ్ స్టేషన్ పల్లి గ్రామస్తులకు తెలవడంతో కుటుంబ సభ్యులతో కలిసి గారేపల్లి కూడలిలో ధర్నాకు దిగారు. గంట పాటు జరిగిన ధర్నాలో బీఆర్ఎస్ నాయకులు సంఘీభావంగా ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నిననాలు చేశారు. ఈ ధర్నాతో మంథని కాటారం, మహాదేవపూర్ కాటారం, భూపాల్ పల్లి కాటారం రహదారిలో ఎక్కడి వాహనాలు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. సంఘటన స్థలంలో ఉన్న పోలీసులు ధర్నాను విరమించాలని పోలీసులు కోరినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు జిల్లా స్థాయి అధికారులు వచ్చి రవి కుటుంబానికి న్యాయం చేసే వరకు ధర్నాను విరమించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు.

ధర్నాను విరమించకపోవడంతో తీవ్ర ట్రాఫిక్ జామ్ కావడంతో ఆర్టీసీ బస్సులు, బొగ్గు ఇసుక లారీలు, కార్లు, ఆటోలు వందల సంఖ్యలో రోడ్లపై నిలిచిపోయాయి. ఈవిషయాన్ని తెలుసుకున్న కాటారం ఎస్సై అభినవ్ జిల్లా కేంద్రం నుండి అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరిస్తామని చెప్పడంతో ధర్నాను విరమించుకున్నారు. ఈ కార్యక్రమంలో జక్కు రాకేష్, బీఆర్ఎస్ కాటారం మండలం ఇంచార్జ్ జోడు శ్రీనివాస్, యూత్ అధ్యక్షులు రామిల కిరణ్, చీమల వంశీ, ఊర వెంకటేశ్వరరావు, ఎస్ఎఫ్ఐ నాయకుడు శ్రీకాంత్, బొడ్డు స్మరణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *