TG | ప‌ల్లా రాజేశ్వ‌ర‌రెడ్డికి కెటిఆర్ ప‌రామ‌ర్శ …

హైదరాబాద్‌ సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కేటీఆర్‌ తెలుసుకున్నారు. శస్త్ర చికిత్స అనంతరం తొందరగానే కోలుకుంటున్నట్లుగా కేటీఆర్‌తో పల్లా వెల్ల‌డించారు. కాగా, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి వేగంగా కోలుకుని, త్వరలోనే తిరిగి ప్రజాక్షేత్రంలో యథావిధిగా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. కేటీఆర్‌ వెంట మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్‌ నాయకులు ఉన్నారు. కాగా, రెండు రోజుల క్రితం ఎర్రవల్లి వ్యవసాయ క్షేతంలోని బాత్‌రూంలో జారిపడటంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి ఎడమ కాలి తొడ ఎముక ఫ్రాక్చర్‌ అయిన సంగతి తెలిసిందే.

Leave a Reply