RC16 సెట్ లో లిటిల్ గెస్ట్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది రామ్ చరణ్ 16వ సినిమా కావడంతో ప్రస్తుతం #RC16 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో అని మెగా ఫ్యాన్స్ చాలా ఆసక్తిగా ఉన్నారు.
కాగా, ఈ సినిమా కోసం భారీ సెట్‌ను నిర్మించారు. అయితే రీసెంట్ గా తన షూటింగ్ సెట్స్ కి స్పెషల్ గెస్ట్ రామ్ తీసుకొచ్చాడు చరణ్. రామ్ చరణ్ తన కూతురు క్లిన్ కారాను #RC16 సెట్స్ కి తీసుకొచ్చాడు.
ఇందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన షూటింగ్‌కి ప్రత్యేక అతిథి రావడం చాలా సంతోషంగా ఉందని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.