Bangalore | కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు..

  • కబ్బన్‌ పార్క్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదు

ఆర్సీబీ తొక్కిసలాటకు సంబంధించి స్టార్‌ క్రికెటర్‌, ఆర్సీబీ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీపై శుక్రవారం పోలీసులకు ఒక ఫిర్యాదు అందింది. కర్నాటకలో శివమొగ్గ జిల్లాకు చెందిన హెచ్‌ఎం వెంకటేష్‌ అనే సామాజిక కార్యకర్త ఎం చిన్నస్వామి స్టేడియానికి దగ్గర్లోని కబ్బన్‌ పార్క్‌ పోలీసు స్టేషన్‌కు ఒక ఫిర్యాదును ఇచ్చారు. దీనిపై పోలీసులు మాట్లాడుతూ తాజా ఫిర్యాదును ఇప్పటికే నమోదైన కేసు కింద పరిగణనలోకి తీసుకొని, దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామని తెలిపారు.

Leave a Reply