ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమర్ధతకు పురాణపండ ‘శ్రీమాలిక ‘పరిమళం !

పిఠాపురం : మంత్ర విద్యలు… మహా విద్యలు… శ్రీ విద్యలు…. పరమ శక్తిసంపన్నమైన స్తోత్రాలు… వేంకటాచలక్షేత్ర వైభవంపై అద్భుత కధనాలు… శ్రీ లక్ష్మీ నృసింహునిపై అత్యద్భుతమైన కధలు…. అపురూప విలువల ఆర్ష విద్యల అమృత కలశంగా ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధికారికమాసపత్రిక ‘ ఆరాధన ‘ పూర్వ సంపాదకులు పురాణపండ శ్రీనివాస్ కలం నుండి ఇటీవల పవిత్రంగా తెలుగువారి ముంగిళ్లకు అందిన నాలుగువందల పేజీల ‘ శ్రీమాలిక ‘ అఖండ మహా గ్రంధాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఏడాది సమర్ధ పాలనను అభినందిస్తూ హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీమంత్రి బొల్లినేని కృష్ణయ్య సమర్పణలో వెలువడటాన్ని తెలుగుదేశం శ్రేణులు అభినందిస్తున్నాయి.

కంచికామకోటి పీఠాధిపతులు, భూతలంపై సంచరించే పవిత్ర ధన్య చరితులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామివారి హస్తాలతో మొదటి ప్రచురణగా ఆవిష్కృతమైన ఈ పుణ్యాల పేటి ‘శ్రీమాలిక’ దివ్యశోభ ఇప్పటికే మహాత్ములైన అత్యద్భుత ప్రవచనకర్తలు చాగంటి కోటేశ్వరరావు వాత్సల్యపూర్వక అమోఘ ప్రశంసలు పొందటం పురాణపండ శ్రీనివాస్ జీవనవైభవంలో ఒక మైలురాయిగా చెప్పక తప్పదు. శ్రీమాలిక గ్రంధాన్ని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు , R R R దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వంటి శిఖరాలు వరుసగా పదహారు పునర్ముద్రణలను ఆవిష్కరించడం ఈ గ్రంథ ఉదాత్తతను తెలియజేస్తోందని తిరుమల మహాక్షేత్ర ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వేనోళ్ళ ప్రశంసలు వర్షించి పురాణపండ శ్రీనివాస్ కు మంగళాశాసనం చేశారు.

ఇలాంటి అమోఘ శ్రీమాలిక గ్రంధాన్ని ఈ వారంలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురం మండలంలోని గొల్లప్రోలు గ్రామదేవత శ్రీ పాదాంబిక అమ్మవారి వార్షిక సంరంభ వేడుకలో వందలకొలది శ్రీమాలిక ప్రతులను శ్రీ పాదాంబిక అమ్మవారి ఆలయ చైర్మన్ మొగిలి అయ్యారావు ఆధ్వర్యంలో పంచనున్నట్లు ఆలయవర్గాలు ప్రకటించాయి.

శ్రీ పాదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ ప్రేమ ఆత్మీయ భక్తి ఆహ్వానం మేరకు అనుకున్న సమయానికి ఉపముఖ్యమంత్రి పవన్ఈ కళ్యాణ్ ఈ వేడుకకు ముఖ్యమంత్రిగా హాజరైతే ఈ పుస్తకాన్ని ఆవిష్కరింప చేసే యోచనలో శ్రీ పాదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ ఉన్నట్లు భక్తుల సమాచారం.

ఇంతటి మహత్కార్యాన్ని భుజాన వేసుకున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కిమ్స్ హాస్పిటల్స్ గ్రూప్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్యను , తెలుగు అందాల సొగసుల్ని పవిత్రతవైపు మళ్లిస్తూ అద్భుత గ్రంధాలను రచిస్తూ … ప్రచురిస్తూ … నిస్వార్ధ యజ్ఞభావనతో సమర్పిస్తున్న పురాణపండ శ్రీనివాస్ మహోజ్వలతను శ్రీ పాదాంబిక అమ్మవారి ఆలయ కమిటీ అభినందించింది.

Leave a Reply