Covid Count | రోజు రోజుకి పెరుగుతున్న కరోనా కేసులు, మరణాలు

దేశంలో 5,364కు చేరిన కరోనా యాక్టివ్‌ కేసులు
గడిచిన 24 గంటల్లో కరోనాతో నలుగురు మృతి
కేరళలో ఇద్దరు, పంజాబ్‌, కర్నాటకలో ఒక్కొక్కరు మృతి
ఈ ఏడాది ఇప్పటివరకు 55 మంది కొవిడ్‌తో మృతి

న్యూ ఢిల్లీ – దేశంలో మహమ్మారి కరోనా వైరస్ కేసులు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కరోనా బారిన పడిన వారి సంఖ్య నేటికి ఐదు వేలు దాటింది. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,364గా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పలు రాష్ట్రాలలో 4,724 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని.. ఇప్పటివరకు వైరస్‌తో దేశవ్యాప్తంగా 55 మంది మరణించినట్లు పేర్కొంది.


కాగా, గత 24 గంటల్లో 498 కొత్త కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో వైరస్‌తో నలుగురు మృతి చెందారు. మరణించిన వారిలో ఇద్దరు కేరళకు చెందిన వారు కాగా.. కర్ణాటక, పంజాబ్‌లలో ఒక్కొక్కరు ఉన్నారు. కేరళలో అత్యధికంగా 1,679 యాక్టివ్‌ కేసులు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. గుజరాత్ (615), పశ్చిమ బెంగాల్ (596), ఢిల్లీ (562) తరువాతి స్థానాల్లో ఉన్నాయి.

Leave a Reply