ADB | అడవుల్లో న్యాయ‌వాదుల విహారం..

జన్నారం, జూన్ 6 (ఆంధ్రప్రభ) : ఉమ్మడి జిల్లాలోని కవ్వాల పులుల అభయారణ్యంలో రాష్ట్ర కోర్టు ప్రభుత్వ ప్లీడర్లు వివరించి వన్యప్రాణులను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా పర్యటనలో భాగంగా హైకోర్టు ప్రభుత్వ ప్లీడరు మహేష్ రాజుతో పాటు 12 ప్లీడర్ల బృందం మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ డివిజనల్ పరిధిలోని గొండుగూడ, బైసన్ కుంట, నీల్గాయికుంట, సోలార్ బోర్వెల్స్, మల్యాల వాచ్ టవర్ అటవీ ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 7గంటలకు సఫారీ వాహనాల్లో గేట్ నెంబరు 1 ద్వారా వెళ్ళి ఆయా ప్రాంతాల్లో పర్యటించారు.

మల్యాల అడవుల్లోని వాచ్ టవర్ ఎక్కి అటవీ అందాలను ఆ ప్రభుత్వ ప్లీడర్లు తిలకించి పరవశించిపోయారు. ఈ సందర్భంగా అడవుల్లో జింకలను, పలు రకాల పక్షులను, అటవీ అందాలను తిలకించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… తాళ్లపేట రేంజ్ ఆఫీసర్, జన్నారం ఇంచార్జి సుష్మారావు, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ లాల్బాయ్, తిరుమలేష్ పనితీరు బేష్ అని కితాబిచ్చారు. వారి వెంట లక్షెట్టిపేట సీఐ డి.రమణమూర్తి, స్థానిక ఎస్సై గొల్లపల్లి అనూష, తదితరులున్నారు. ఆ బృందానికి అటవీ అధికారులతో పాటు, పోలీసులు, స్థానిక హరిత రిసార్ట్ మేనేజర్ వీరేందర్ పుష్పగుచ్చం అందజేశారు.

Leave a Reply