పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా ఘటన బయటపడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసి, అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులపై నిఘా పెట్టి తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు అనుమానితులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. తాజాగా సీఆర్పీఎఫ్‌కు చెందిన ఓ జవాను కూడా గూఢచారిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అతడు పాకిస్థాన్‌కు అత్యంత కీలక సమాచారాన్ని పంపినట్టు ఆరోపణలతో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అతడిని అరెస్ట్ చేసింది.
తర్వాత అతడిని ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఈ ఆరోపణలు దేశ భద్రతకు పెద్ద ముప్పుగా మారే అవకాశముందని పేర్కొన్నారు. నిందితుడిని జూన్ 6 వరకు ఎన్‌ఐఏ కస్టడీలో ఉంచాలని ఆదేశించారు.