Hayatnagar | కారు – డిసిఎం ఢీ : ముగ్గురు దుర్మరణం

హైదరాబాద్ : నగరంలో హయత్ నగర్ మండలంలోని కుంట్లూరులో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున ఆగి ఉన్న డీసీఎంను కారు ఢీకొట్టింది.

ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి.. పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులోభాగంగా మృతుల బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. మరోవైపు ఈ ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి పరిస్థితి సైతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Leave a Reply