న్యూ ఢిల్లీ – స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు మరోసారి షాక్ ఇచ్చింది. బ్యాంక్ ఇటీవల ఫిక్స్‌డ్ డిపాజిట్ల పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇది కస్టమర్లకు ఆందోళన కలిగించే అంశంగా మారింది. ఈ క్రమంలో అన్ని కాలపరిమితి గల ఫిక్స్ డ్ రేట్లను 20 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం సామాన్య ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్ల డిపాజిట్లపై కూడా ప్రభావం చూపిస్తుంది. ఎస్బిఐ వెబ్‌సైట్ ప్రకారం ఈ వడ్డీ రేట్ల కోత చివరిసారిగా ఏప్రిల్ 15, 2025న జరిగింది. అంటే, కేవలం ఒక నెల వ్యవధిలోనే బ్యాంక్ మరోసారి వడ్డీ రేట్లను తగ్గించడం విశేషం.
Reduced Rates | కస్టమర్లకు ఎస్బీఐ షాక్ – ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ కోత
