Visakha | ప‌లువురు టిడిపి కార్పొరేట‌ర్లు గైర్హాజ‌ర్ – విశాఖ డిప్యూటీ మేయ‌ర్ ఎన్నిక వాయిదా

విశాఖ‌ప‌ట్నం – మహా విశాఖ నగర పాలక సంస్థ ఉపమేయరు ఎన్నిక కోరం లేక వాయిదా పడింది. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అధ్యక్షతన నేడు నిర్వహించిన సమావేశంలో 56 మంది సభ్యులుగాను 54 మంది హాజరయ్యారు. దీంతో కోరం లేకపోవడంతో రేపటి ఈ ఎన్నిక‌ల‌ను వాయిదా వేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఉప మేయర్ పదవి జనసేనకు కేటాయించడంపై పలువురు టిడిపి కార్పొరేటర్లు సమావేశాన్ని బహిష్కరించారు. ఈ పోస్ట్ టిడిపికే కేటాయించాలంటూ ఆ కార్పొరేట‌ర్లు ప‌ట్టు ప‌డుతున్నారు.. దీంతో టిడిపి వారిని బుజ్జ‌గించే ప‌నిలో ప‌డింది..

Leave a Reply