- రోజుకు 2.2 లక్షల టన్నులబొగ్గు ఉత్పత్తి,
- 2.4 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలి.
వర్షాకాలం సమీపిస్తూన్న నేపథ్యంలో సింగరేణి సంస్థలో బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణాకు అంతరాయం కలగకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్. బలరామ్ అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లను కోరారు.
ఈ మేరకు నేడు (శనివారం) సీఎండీ బలరామ్ కొత్తగూడెం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని ప్రాంతాల జనరల్ మేనేజర్లు మరియు డైరెక్టర్లతో బొగ్గు ఉత్పత్తిపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా బలరామ్ మాట్లాడుతూ.. భారీ వర్షాలతో ఓపెన్ కాస్ట్ క్వారీలలో నీరు నిలిచి బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడే అవకాశం ఉన్నందున, గుంతల నుండి నీటిని తొలగించడానికి ముందుగానే మోటారు పంపులను సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ప్రతి గనికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించుకోవాలని.. కనీస రోజువారీ బొగ్గు ఉత్పత్తి 2.2 లక్షల టన్నులు, రవాణా 2.4 లక్షల టన్నులు సాధించాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో సంస్థ డైరెక్టర్ ఈ అండ్ ఎం.డి. సత్యనారాయణ రావు, డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్, పా కె. వెంకటేశ్వర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ ఎస్ డి. ఎం సుభాని, డైరెక్టర్ సి పి పి మనోహర్ , జి.ఎం మార్కెటింగ్ ఎన్. వి రాజశేఖర్ రావు లతో పాటు అన్ని ఏరియాలోని జనరల్ మేనేజర్లు, కార్పొరేట్ లోని వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.