TG | హైదరాబాద్ పోలీసులను చూస్తే గ‌ర్వంగా ఉంది – రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ , ఆంధ్ర‌ప్ర‌భః హైదరాబాద్ పోలీసులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల నియంత్రణలో తెలంగాణ పోలీస్‌ నెంబర్‌‌లో నిలవడం గర్వంగా ఉందన్నారు. డ్రగ్ ఫ్రీ తెలంగాణ కోసం తన కలలను సాకారం చేస్తున్న పోలీసులకు ఎప్పుడు మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఎక్స్‌లో ముఖ్యమంత్రి రేవంత్ పోస్ట్ చేశారు.

రేవంత్ ట్వీట్ ఇదే..

వివిధ రంగాల్లో ప్రపంచానికి తెలంగాణ రోల్ మోడల్ గాఉండాలన్నది నా ఆకాంక్ష. మాదకద్రవ్యాల నియంత్రణలో 138 దేశాలతో పోటీ పడి ఈ రోజు తెలంగాణ పోలీస్ ప్రపంచంలో నెంబర్ వన్ స్థానాన్ని సాధించడం గర్వంగా ఉంది. ఈ ఘనతను సాధించిన హైదరాబాద్ నార్కొటిక్ ఎన్‌ఫోర్స్‌మెంట్ చీఫ్ సీవీ ఆనంద్‌కు, ఆయన బృందానికి నా ప్రత్యేక అభినందనలు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం నేను కంటున్న కలలను సాకారం చేయడానికి కృషి చేస్తున్న ప్రతి పోలీస్‌కు నేను మద్దతుగా ఉంటాను అంటూ సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీట్ చేశారు.

Leave a Reply