Srikakulam | సడన్ బ్రేక్ తో నాలుగు వాహనాలు ఢీ – ఒకరి మృతి

శ్రీకాకుళం జిల్లా రూరల్ మండలంలోని జాతీయ రహదారిలో నీలం జూట్ మిల్ దగ్గర ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను అంబులెన్స్‌లో రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంలో బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసమయ్యారు. శ్రీకాకుళం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బరంపురం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న ట్రావెల్ బస్సును ఓ గ్రానైట్ లారీ ఢీట్టింది. దాంతో వెనకాలే ఉన్న మరో గ్రానైట్ లారీ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. సడన్ బ్రేక్ కారణంగా వెనుకనున్న లారీ క్యాబిన్‌పై ఓ గ్రానైట్ బ్లాక్ పడింది. లారీ క్యాబిన్‌లో ఇరుక్కుని డ్రైవర్ మృతి చెందాడు.

ఈ ఘటనలో మొత్తంగా బస్సుతో సహా నాలుగు లారీలు ధ్వంసం అయ్యాయి. ఈ ప్రమాదం కారణంగా జాతీయ రహదారిలో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *