Accident |తుని వద్ద కారు – లారీ ఢీ : నలుగురు దుర్మరణం

తుని : కాకినాడ జిల్లా తుని వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టింది ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందారు.మరో ఇద్దరికి గాయాలయ్యాయి. మృతులంతా రాజమహేంద్రవరం అపోలో ఫార్మసీ ఉద్యోగులు

మృతులను రాజమహేంద్రవరానికి చెందిన గెడ్డం రామరాజు, హాజరత్ వాలీ, తణుకుకు చెందిన వరాడ సుధీర్‌గా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ గోనా శివశంకర్, వెంకట సుబ్బారావును చికిత్స నిమిత్తం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

శుక్రవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశానికి హాజరై కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీ విశాఖపట్నం నుంచి మండపేటకు ఐరన్ లోడ్‌తో వెళ్తోంది.

Leave a Reply