హైదరాబాద్ : హైటెక్ సిటీ ఐటీ కారిడార్లో శుక్రవారం సాయంత్రం ఒక కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో కారు ఇంజిన్ కాలిపోయింది.
అయితే కారు నడుపుతున్న వ్యక్తి వెంటనే కారు ఆపి బయటకు వచ్చాడు. ఈ సంఘటన గురించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న మాదాపూర్ అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. ఈ ప్రమాదం కారణంగా సైబర్ టవర్ నుండి మైండ్ స్పేస్ వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.