KNL | సింధూర్ విజయం ఎనలేనిది : మంత్రి టీజీ భరత్

కర్నూలు బ్యూరో : పాకిస్తాన్, ఉగ్రమూక‌లపై భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో ఎన్డీఏ చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా శుక్రవారం కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయం వ‌ద్ద‌ నుండి ప్రారంభమైన యాత్రకు పరిశ్రమల శాఖ మంత్రి భరత్ పాల్గొని ప్రారంభించారు. ఇందుకు కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పాలకుర్తి తిక్కారెడ్డి, ఆదోని నియోజకవర్గం శాసనసభ్యులు పార్థసారథి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జనసేన జిల్లా అధ్యక్షులు సురేష్ తో పాటు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

ప్రజల భాగస్వామ్యంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆపరేషన్ సింధూర్ పేరుతో విరోచితంగా పోరాడడంతో విజయం దక్కిందన్నారు. ఈ క్రమంలో భారత త్రివిధ దళాల సైనికులకు మద్దతుగా ఆత్మీయమైన సంఘీభావం తెలియజేస్తూ జిల్లా పరిషత్ కార్యాలయం నుండి కలెక్టర్ ఆఫీస్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వై.నాగేశ్వరరావు యాదవ్, కెవి సుబ్బారెడ్డి, నంద్యాల నాగేంద్ర పద్మలతా రెడ్డి, మధు, జేమ్స్, హనుమంతరావు చౌదరి, రామాంజనేయులు, బాలరాజ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply