97. మృతుని తలచు కొనుచు హితులు దు:ఖించిన
బ్రతుకగలడె? వాడు గతుకగలడె
చింతలేనివాడె చిన్మయానందుడు
గీతదాత నీకు కేలుమోడ్తు
98. అర్జునుండనంగ అరయ సామాన్యుడే
దిక్కుతోచకుండు దిక్కులందు
అట్టివాని మదిని పట్టి రంజింపుము
గీతదాత నీకు కేలుమోడ్తు
99. ఎవడు బంధువయ్య ఎవడు పరాయిలే
ఎంచిచూడ మనిషి సంచితమున
దేహమంతనొకటె మోహమంతనొకటె
గీతదాత నీకు కేలుమోడ్తు