నిజామాబాద్ ప్రతినిధి, మే 9(ఆంధ్రప్రభ) : ఉగ్రవాదుల నెత్తుటితో భారతమాతకు వీర తిలకం దిద్దడమే ఆపరేషన్ సింధూర్ అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. ఇండియా – పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో భారత సైన్యానికి, భారత భూభాగానికి, దేశ ప్రజలకు ఎటువంటి నష్టం జరగకూడదని, ఈ యుద్ధంలో భారత్ ఘన విజయం సాధించాలని శుక్రవారం భారతీయ జనతా పార్టీ నగర శాఖ ఆధ్వర్యంలో అర్బన్ శాసనసభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ స్వయంభూ నీల కంఠేశ్వర ఆలయంలో ప్రతేక పూజలు నిర్వ హించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కశ్మీర్ లో పహాల్గామ్ ఘటన తరువాత ప్రతి భారతీయునిలో మరిగిన రక్తానికి, ఆవేదనకు ప్రతీకారంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ పైన భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించడం అనేది భారత్ శక్తి యుక్తులకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.