హైదరాబాద్ – ప్రభుత్వ భూమి కబ్జాకు గురైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కబ్జాకు గురైన 12 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్థలాన్ని శనివారం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రెవెన్యూ అధికారులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ భూమికి ఫెన్సింగ్ వేసే విషయంలో అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడిన కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ ను మంత్రి ప్రత్యేకంగా అభినందించారు.
TG | 12 ఎకరాల ఆక్రమణ భూమి స్వాధీనం – అధికారులకు పొన్నం అభినందనలు
