Crime | మహిళను ఇటుకతో కొట్టి హ‌త్య‌

రామగిరి, (ప్రభన్యూస్‌): రామగిరి మండలం కల్వచర్ల గ్రామంలో దారుణ హత్య చోటు చేసుకుంది. మహిళను సిమెంట్‌ ఇటుకతో తలపై కొట్టి దారుణంగా చంపిన ఘటన జిల్లాలో సంచలనం రేపింది. మద్యం మత్తులో నిందితుడు మహిళను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల కథన ప్రకారం.. మంచిర్యాల జిల్లా ఐబీ తాండూర్‌కు చెందిన మోటం- తూర్పాటి సమ్మక్కను పత్తి కనకయ్య అనే వ్యక్తి హత్య చేశాడు. సమ్మక్క, కనకయ్యలు కల్వచర్లలోని బంధువుల ఇంటికి రాగా, శుక్రవారం రాత్రి కనకయ్యతో మద్యం మత్తులో మాట మాట పెరిగి క్షణికావేశంలో సిమెంట్‌ ఇటుకతో సమ్మక్క తలపై మోది హత్య చేశాడు. ఇరువురు చిత్తు కాగితాలు ఏరుకుంటూ బేరం నిర్వహిస్తారని రామగిరి ఎస్‌ఐ చంద్రకుమార్‌ తెలిపారు.

నిందితుడు పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పద్దపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా, మృతురాలు సమ్మక్కకు భర్త లేక పోవడంతో కనకయ్యతో కలిసి ఉంటున్న‌ది. ఆమెకు ముగ్గురు పిల్లలుండగా, కనకయ్యకు భార్య, పిల్లలు ఉన్నారు

Leave a Reply