NLG | భవన కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు

పెన్ పహాడ్ మండలం, మే 1: భవన కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఆ సంఘం అధ్యక్షులు చిన్న పంగి నాగరాజు అన్నారు. గురువారం మండల కేంద్రంలో ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా భవన కాలంతో అనుబంధ సంఘాల సిఐటియు జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కుల కోసం నిరంతరం పోరాడుదామ‌ని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ఫేక్ మీరా, ఆ సంఘం సభ్యులు ఒగ్గు సైదులు, వెన్న రమణయ్య, షేక్ బాషా, అలీ సాబ్, శేఖర్, నాగయ్య, వెంకన్న, రాములు, జానయ్య, సోమయ్య, తదితరులు పాల్గొన్నారు.

హమాలి సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు…
పెన్ పహాడ్ మండలం, మే1 ఆంధ్ర‌ప్రభ : నాలుగు నల్ల చట్టాలు రద్దు చేసి కార్మిక హక్కులను కాపాడాలని సిఐటీయు యూనియన్ అధ్యక్షులు వగ్గు శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్మిక దినోత్సవం సందర్భంగా సిఐటియు జెండాను ఆవిష్కరించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కార్మికులంతా తమ హక్కుల కోసం ఐక్యతంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో హమాలి కార్మికుల సంఘం నాయకులు వగ్గు జలంధర్, ఒగ్గు అంజయ్య, ఒగ్గు రాములు, గూడపూరి జానయ్య, ఒగ్గు ఎల్లయ్య, కత్తి ఉపేందర్, కోట సైదులు, ఒగ్గు చిన్న సైదులు, ఒగ్గు రవి, హనుమంతు, నాగయ్య, బక్కయ్య, ఆనంద్, జానీ, రాజు, చింటూ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply