కృష్ణ శతకం

  1. మాటలు వినసొంపు మహిమలు కన ఇంపు
    ఆటలన్న నీవి అద్భుతమ్ము
    మనసుజూడ మేము మైమరతుము సామి
    గీతదాత నీకు కేలుమోడ్తు
  2. మేనమామ కంసు ప్రాణాలు తీసిన
    వీరుడవయ మేటి ధీరుడవయ
    మేనయత్త రాధ ప్రాణప్రదమునీకు
    గీతదాత నీకు కేలుమోడ్తు
  3. నందనందనునకు వందనములు లక్ష
    పెట్టుమయ్య మాకు ప్రేమ భిక్ష
    సర్వజంతుతతికి సర్వస్వమే నీవు
    గీతదాత నీకు కేలుమోడ్తు

Leave a Reply