ఈరోజు ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడయం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పరుగుల మోస్తరు పరుగులు నమోదు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన ఢిల్లీ 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. అయితే, ఢిల్లీ బ్యాటర్లలో మిడిలార్డర్ బ్యాటర్ ట్రిస్టన్ స్టబ్స్ (18 బంతుల్లో 34) ఒక్కడే మెరుపు ఇన్నింగ్ తో జట్టు స్కోర్ ను పరుగులు పెట్టించాడు.
ఆఖరి ఓవర్లలో చెలరేగిన స్టబ్స్.. 6 వికెట్లకు 120గా ఉన్న స్కొర్ ను ధనాధన్ బౌండరీలతో 162 కు చేర్చాడు. ఇక కేఎల్ రాహుల్ (41) కీలకిన్నింగ్స్ ఆడాడు. ఓపెనర్ అభిషేక్ పోరెల్ (28), ఫాఫ్ డు ప్లెసిస్ (22) పరువాలేదనిపంచారు. విప్రజ్ నిగమ్ (12), కెప్టెన్ అక్షర్ పటేల్ (15) పరుగులు చేశారు.
ఆర్సిబి బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, జోష్ హాజిల్‌వుడ్ రెండు వికెట్లు పడగొట్టారు. ఇక యష్ దయాల్, కృనాల్ పాండ్యా తలా ఒక వికెట్ తీసుకున్నారు. కాగా, 163 పరుగుల విజయ లక్ష్యంతో ఛేజింగ్‌కు దిగనుంది.