చెన్నూర్ ఆంధ్రప్రభ : అమలు కానీ హామీలను చేసి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించడమే బిఆర్ఎస్ లక్ష్యం అని మాజీ ఎమ్మెల్యే జిల్లా అధ్యక్షులు బాల్క సుమన్ అన్నారు. ఆదివారం వరంగల్ జిల్లాలో జరుగనున్న బిఆర్ఎస్ రాజీతోత్సవ సభకు చెన్నూర్ నియోజకవర్గ పరిధిలోని నాయకులను కార్యకర్తలను అభిమానులను సుమన్ తరలించే ఏర్పాటు చేశారు. ఉదయాన్నే తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాలవేసి రోడ్ షో నిర్వహించిన సుమన్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన హామీలను అమలుచేయని విధానాన్ని ఎండగట్టరు.
తన హయాంలో చేసిన అభివృద్ధి పనులు నిధులు కేటాయించక పనులు నిలిచిపోయిన స్థానిక ఎమ్మెల్యే వివేక్ ఎలాంటి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వక పోవడం చేతగాని తననానికి నిదర్శనమని అన్నారు. తను చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన కట్టి ప్రారభించడం తప్ప వివేక్ నియోజకవర్గానికి చేసిందని గుర్తు చేశారు, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ది చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.