పెద్దపల్లి, ఆంధ్రప్రభ : అసత్యపు ప్రచారాలతో అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతును రాజును చేసే రైతు బంధును నీరుగార్చారని నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
బుధవారం జిల్లా కేంద్రంలోని భారత రాష్ట్ర సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. దేశం మొత్తం తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు వైపు చూశారని అటువంటి పథకాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినటువంటి అమలు చేయకుండా రైతులను మోసగించారన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేస్తామని చెప్పిన ప్రభుత్వం జిల్లాకు ఒక పెట్రోల్ బంక్ జిల్లా సమాచా ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తామని చెప్పడం సిగ్గుచేటమని దాని ద్వారా ఒక్కో మహిళలకు ఒక రూపాయి కూడా రాదన్నారు.
తెలంగాణ సాధకుడు కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేసిన కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 16 నెలలు గడిచిన అమలు చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.
గురుకుల వ్యవస్థను పూర్తిగా నీరు గార్చారని దీంతో నిరుపేద విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. అకాల వర్షాలకు రైతులు పంట నష్టపోయారని, కానీ వారిని పరామర్శించిన వారే లేరన్నారు.
ఈనెల 27వ తేదీన వరంగల్లో తలపెట్టిన రజతోత్సవ సభ, తెలంగాణ కుంభమేళాకు రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుండి పెద్ద ఎత్తున తెలంగాణ వాదులు తరలిరావాలని కోరారు.