HYDRAA Celebrations | బతుకమ్మ ఉత్సవాలు ‍ప్రారంభించిన హైడ్రా క‌మిష‌న‌ర్‌

హైదరాబాద్ – వచ్చే బతుకమ్మ ఉత్సవాల నాటికి బతుకమ్మ కుంటను సిద్ధం చేస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. బతుకమ్మ కుంటలు సంబంధించిన కోర్టు వివాదం మంగళవారం పరిష్కారమయ్యిందన్నారు. హైడ్రా కమిషనర్ అంబర్ పేటలోని బతుకమ్మ కుంటను నేడు సందర్శించారు. స్థానికుల సమక్షంలో. బతుకమ్మ కుంట అభివృద్ధి పనులను వేద మంత్రిచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌, అభివృద్ధి, సుంద‌రీక‌ర‌ణ ప‌నులు జ‌ర‌గాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ చెరువును పున‌రుద్ధ‌రిస్తే ప‌రిస‌రాల‌న్నీ ఆహ్లాద‌క‌రంగా మారుతాయ‌ని అన్నారు. ప‌నుల‌కు స‌హ‌క‌రించాల‌ని స్థానికుల‌ను కోరారు.

ఈ కార్య‌క్ర‌మానికి స్థానికులు పెద్ద ఎత్తున హాజ‌ర‌య్యారు. అభివృద్ధి ప‌నుల‌కు పూర్తి స‌హ‌కారం అందిస్తామ‌ని స్థానికులు క‌మిష‌న‌ర్‌కు హామీ ఇచ్చారు.

Leave a Reply