చిట్యాల, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ) : జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలో బీజేపీ అనుబంధ బీజేవైఎం మండల అధ్యక్షుడు మైదం శ్రీకాంత్ ఆధ్వర్యంలో బుధవారం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. బీజేవైఎం రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దహనం చేసినట్లు పేర్కొన్నారు. అనంతరం శ్రీకాంత్ మాట్లాడుతూ… దక్షిణ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో హిందువులని నిర్ధారించుకున్న తర్వాత వాళ్లను కాల్చి చంపేశారన్నారు.
కొన్ని రాజకీయ పార్టీలు హిందువులను జెండాలు మోసే బానిసలుగానే చూస్తున్నాయని, ఇప్పటికైనా కూడా హిందువులు మేల్కొని సంఘటితమై ఈ దేశాన్ని ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్క హిందువు సంఘటితమై ఉగ్రవాదులు గాని దేశంలో సెక్యూలరిజం ముసుగులో ఉన్న రాజకీయ పార్టీలను బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం మండల నాయకులు పెరుమండ్ల రాజు, అజయ్, రవీందర్, రాజేష్, సదానందం, సురేష్, ప్రవీణ్, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.