న్యూ ఢిల్లీ – రాజధాని ఢిల్లీలోని ముస్తఫాబాద్‌లో నాలుగంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనలో నలుగురు మృతి చెందారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఈ తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నిర్వహణ అధికారులు (ఎన్డీఆర్ఎఫ్) సహాయక చర్యలు ప్రారంభించారు.
భవనం కూలిన ఘటనలో నలుగురు మృతి చెందారని, మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నారని పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఘటన జరిగిందని, ఇప్పటి వరకు 14 మందిని రక్షించామని, వారిలో నలుగురు తీవ్ర గాయాలతో మృతి చెందారని తెలిపారు. శిథిలాల కింద ఇంకా 8-10 మంది చిక్కుకుని ఉన్నారని వివరించారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్టు పేర్కొన్నారు.