న్యూఢిల్లీ : భగవద్గీతకు అరుదైన గుర్తింపు లభించింది. యునెస్కో మెమొరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ చోటు దక్కింది. భగవద్గీతతో పాటు భరతముని రచించిన నాట్య శాస్త్రానికి కూడా ఈ గౌరవం లభించింది0 . ఈ విషయాన్ని వెల్లడిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ హర్షం వ్యక్తంచేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగిన విషయమని అన్నారు.
“ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడూ గర్వించదగ్గ క్షణం. యునెస్కో మెమరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్‌లో భగవద్గీత, నాట్యశాస్త్రాన్ని చేర్చడం మన గొప్ప సంస్కృతి, జ్ఞానానికి దక్కిన గుర్తింపు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయి. వారి అంతర్దృష్టులు ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి” అని ప్రధాని మోదీ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.