ADB | సంకల్పంతో చదివితే లక్ష్యాన్ని సాధించవచ్చు: ఎమ్మెల్యే బోజ్జు పటేల్

ఉట్నూర్, ఏప్రిల్ 17 (ఆంధ్రప్రభ) : విద్యార్థులు సంకల్పంతో చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని, ఉన్నత స్థాయికి ఎదగవచ్చని, అదే దిశగా విద్యార్థులు ఒక లక్ష్యంతో చదువుకోవాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల వార్షికోత్సవ వేడుకలు హెచ్ కే జి ఎన్ ఫంక్షన్ హాల్ లో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులు ఒక స్ఫూర్తితో ముందుకు సాగాలని, తాను కూడా డిగ్రీ చదివే రోజుల్లో ఇప్పుడున్న సౌకర్యాలు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు చదువుకోవాలన్నారు. తనకు ఉద్యోగం అంటే ఇష్టం లేదని ఉద్యమ నాయకునిగా రాజకీయాల్లో ఎదగాలనే తపనతో ముందుకు వెళ్లగా, చాలు అనుకున్న లక్ష్యాన్ని ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవచేసే యోగ్యం లభించిందన్నారు. తనలాగే ఒక లక్ష్యంతో చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఎమ్మెల్యే కోరారు. అనంతరం కళాశాలలో క్రీడల్లో, ఇతర రంగాల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ విద్యార్థులకు ఎమ్మెల్యే మెమొంటోలతో సన్మానం చేశారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రతాప్ సింగ్ మాట్లాడుతూ… ప్రభుత్వ డిగ్రీ కళాశాల 2007లో నుండి ప్రారంభమైందని తెలిపారు. ఇప్పటి వరకు కళాశాల ద్వారా మంచి ఫలితాలు సాధిస్తున్నామని, క్రీడలు నైపుణ్యాల్లో కళాశాల విద్యార్థులు రాణించడం రాష్ట్రస్థాయిలో మూడో బహుమతి గెలవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటీడీఏ పీవీటీజీ ఏపీఓ, బీడీ కళాశాల ప్రిన్సిపల్ మేస్రం మనోహర్, జైనూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జైవంథ్ రావు, కాంగ్రెస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గం ఆత్రం రాహుల్, కళాశాల ప్రిన్సిపల్ ప్రతాప్ సింగ్, పూర్వ ప్రిన్సిపాల్ స్వామి, వైస్ ప్రిన్సిపాల్ సాయి ప్రసాద్, కళాశాల కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, విద్యార్థినీలు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply