DC vs RR | రాజ‌స్థాన్ ముందు ఊరించే టార్గెట్..

ఢిల్లీ : ఈరోజు రాజ‌స్థాన్ తో జ‌రుగుతున్న మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ డిఫెండ‌బుల్ స్కోర్ న‌మోదు చేసంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేప‌ట్టిన ఢిల్లీ.. బ్యాట‌ర్ల‌లో ఓపెన‌ర్ అభిషేక్ పోరెల్ (49) రాణించ‌గా.. కేఎల్ రాహుల్ (38), కెప్టెన్ అక్ష‌ర్ పటేల్ (34), ట్రిస్ట‌న్ స్ట‌బ్స్ (34) ఆక‌ట్టుకున్నారు. దాంతో ఢిల్లీ జ‌ట్టు నిర్ణీత ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 188 ప‌రుగులు సాధించింది.

రాజస్థాన్ బౌలర్లలో జాఫ్రా ఆర్చర్ రెండు వికెట్లు పడగొట్టగా, మహేష్ తీక్షన, వనిందు హసరంగా తలా ఒక వికెట్ తీసుకున్నారు. దీంతో రాజ‌స్థాన్ జ‌ట్టు 189 ప‌రుగ‌ల టార్గెట్ తో ఛేజింగ్ కు దిగ‌నుంది.

Leave a Reply